SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 10:06 pm Posted by : SALAM PRODDATUR

భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి

 

యువత, విద్యార్థులు, ఆరోగ్యవంతులు రక్తదానానికి ముందుకు రావాలి – డాక్టర్‌ వరుణ్‌కుమార్‌రెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు :

స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని డాక్టర్‌ వరుణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్లను గురువారం డాక్టర్‌ వరుణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 28న ఉదయం 9:30 గంటలకు ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ముఖ్యంగా గర్భిణులు, అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రక్త నిల్వల్లో కొరత ఏర్పడకుండా యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు.ఆరోగ్యంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, ఒకరు చేసే రక్తదానం అత్యవసర సమయంలో మరొకరి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. భగత్‌సింగ్‌ దేశం కోసం చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం ద్వారా సేవా భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు పాలజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్‌రాజ్, సుమన్‌, జాషువా, శేఖర్‌, ఆరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.