కమిషనర్ నగర బాట.. సమస్యలపై స్పాట్‌లోనే క్లాస్!
–డ్రైన్ల అక్రమ నిర్మాణాలకు వారం రోజుల డెడ్‌లైన్ –పారిశుద్ధ్యంపై ప్రత్యేక నిఘా.. అధికారులకు టైమ్‌బౌండ్ ఆదేశాలు సలాం ప్రొద్దుటూరు : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తూ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ‘నగర బాట’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మోడంపల్లి ప్రాంతంలో మున్సిపల్, వార్డు సచివాలయ అధికారులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.పర్యటనలో భాగంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు తదితర మౌలిక...