SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:40 pm Posted by : SALAM PRODDATUR

శివాలయం గణపతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి

 

–ఘనంగా 50వ వార్షికోత్సవ వేడుకలు.. స్వర్ణోత్సవ సావనీర్‌ ఆవిష్కరణ

 

సలాం   ప్రొద్దుటూరు:

శివాలయం శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఉత్సవ కమిటీ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కమిటీ సభ్యులతో కలిసి 50వ వార్షికోత్సవ స్వర్ణోత్సవ సావనీర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐదు దశాబ్దాలుగా గణపతి ఉత్సవాలను కొనసాగిస్తూ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తున్న కమిటీని ఆయన అభినందించారు.సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం స్వర్ణోత్సవ సావనీర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 50 ఏళ్ల ఉత్సవ ప్రస్థానానికి సంబంధించిన విశేషాలను సావనీర్‌లో పొందుపరిచినట్లు నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో శివాలయం ఛైర్మన్ వంగల నారాయణారెడ్డి, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మల్లికార్జునరావు, వీరారెడ్డి, సుధీర్ నాయుడు, అట్ల నరసింహారెడ్డి, కొప్పర్తి శేఖర్, పుల్లయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.