SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 12:29 am Posted by : SALAM PRODDATUR

వీఆర్ఏలకు పే స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి

 

–సమస్యలు పరిష్కరించకపోతే సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతాం

–ఏపీ గ్రామ రెవెన్యూ శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పెద్దన్న

సలాం ప్రొద్దుటూరు –కమలాపురం:

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ గ్రామ రెవెన్యూ శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పెద్దన్న డిమాండ్ చేశారు.వీఆర్ఏలకు పే స్కేల్, ఉద్యోగ భద్రత, కారుణ్య నియామకాలు అమలు చేయడంతో పాటు అర్హులైన వారికి పదోన్నతులు, రెగ్యులరైజేషన్ కల్పించాలని కోరారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు విజ్ఞాపన పత్రాలు అందజేసినా ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదన్నారు.ప్రస్తుతం వీఆర్ఏలకు అందుతున్న వేతనాలు జీవనానికి సరిపోవడం లేదని పెద్దన్న పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న సుమారు 20 వేల మంది వీఆర్ఏలకు కూడా పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే వీఆర్ఏలు సహాయ నిరాకరణ ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోక్యం చేసుకుని వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని పెద్దన్న విజ్ఞప్తి చేశారు.