ప్రొద్దుటూరు పురపాలక చరిత్రలో మరో అభివృద్ధి అధ్యాయం
–40 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులకు శ్రీకారం –రానున్న రోజుల్లో డ్రైనేజీ, నీటి పైపులైన్లు, సీవరేజ్ ట్రీట్‌మెంట్‌కు మరో రూ.252 కోట్ల పనులు చేపడతామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వెల్లడి సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.40 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి వర్చువల్ కార్యక్రమం నిర్వహించగా, ప్రొద్దుటూరు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...