తెల్లవారుజామునే రంగంలోకి కమిషనర్..!
–ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యవేక్షణ –ఉదయం 4 గంటలకే మున్సిపల్ సిబ్బందితో కలిసి డ్రైనేజీ పరిస్థితుల పరిశీలన – ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ సలాం ప్రొద్దుటూరు: ప్రజా సమస్యలు ఎదురైనప్పుడు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలించడం ద్వారా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తన విధి నిర్వహణ పట్ల నిబద్ధతను చాటుకున్నారు. పట్టణంలో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించేందుకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకే మున్సిపల్...