గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు.. నవయుగ వైతాళికుడు
–గొప్ప సంఘసంస్కర్తగా గురజాడ సేవలు చిరస్మరణీయం –డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి సలాం ప్రొద్దుటూరు – వేంపల్లి: గురజాడ అప్పారావు అభ్యుదయ కవితా పితామహుడని, నవయుగ వైతాళికుడిగా తెలుగు సమాజానికి దిశానిర్దేశం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. సోమవారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ “దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్”...