సలాం ప్రొద్దుటూరు:
సోమవారం శివాలయం గణపతి ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు బొగ్గుల సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.