SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 11:56 pm Posted by : SALAM PRODDATUR

గురప్పకోనలో ప్రొద్దుటూరు టీడీపీ నేతల సందడి

 

ఎమ్మెల్యే అధికారిక పీఏ గురుమోహన్ కుమార్తె కేశఖండన

–వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన నాయకులు

 

సలాం ప్రొద్దుటూరు –మైలవరం:

జమ్మలమడుగు నియోజకవర్గంలోనీ మైలవరం మండలం లొ వెలిసిన ప్రముఖ గురప్పకోనలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అధికారిక పీఏ గురుమోహన్ కుమార్తె కేశఖండన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్సల గురువిరెడ్డి కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఆత్మీయంగా సాగిన వేడుక

 

సంప్రదాయబద్ధంగా నిర్వహించిన కేశఖండన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. గురప్పకోనలో వేడుక సందడిగా సాగింది. చిన్నారి ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఎదగాలని నాయకులు ఆకాంక్షించారు.

 

పలువురు టీడీపీ నాయకుల హాజరు

 

ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల మాజీ జెడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి, నాయకులు బచ్చల వీరప్రతాప్, ఈవీ సుధాకర్‌రెడ్డి, ద్వారకచర్ల రాఘవరెడ్డి, బద్వేలి శ్రీనివాసులరెడ్డి, పట్నం లక్ష్మణ్, ఆసాం సురేష్‌కుమార్‌రెడ్డి, మార్తల గురువిరెడ్డి, చీమల రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గురుమోహన్ కుటుంబ సభ్యులు కార్యక్రమానికి హాజరైన నాయకులు, బంధువులు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు.