స్వచ్ఛత హీ సేవలో గార్బేజ్ పాయింట్ శుభ్రత

  –పారిశుధ్య కార్మికులుగా మారిన కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్, ఏఈ దస్తగిరి   సలాం  ప్రొద్దుటూరు: స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం మూడో రోజు సందర్భంగా వైఎంఆర్ కాలనీలోని పి.డబ్ల్యూ. ఆఫీస్ వద్ద ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్‌ను శుభ్రం చేశారు.గార్బేజ్ పాయింట్ వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను పూర్తిగా తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, ఏఈ దస్తగిరి పారిశుధ్య సిబ్బందితో...