విద్యార్థులే స్వచ్ఛ ప్రొద్దుటూరు కు మార్గదర్శకులు
అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో స్వచ్ఛతా హీ సేవా – రెండో రోజు కార్యక్రమం –ప్లాస్టిక్ నివారణ, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అవగాహన సలాం ప్రొద్దుటూరు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పాల్గొని విద్యార్థులకు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో కమిషనర్ ముచ్చటిస్తూ...