11 లక్షల లావాదేవీపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి
–టౌన్ బ్యాంక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సలాం ప్రొద్దుటూరు: టౌన్ బ్యాంక్‌లో జరిగిన రూ.11 లక్షల లావాదేవీపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బ్యాంక్ లెడ్జర్లు, ఖాతా వివరాలు, సంబంధిత పత్రాలను పరిశీలించాలని కోరారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాచమల్లు.. టౌన్ బ్యాంక్ వ్యవహారంపై టీడీపీ నాయకుడు...