ఆపదలో అండగా నిలిచిన కొనిరెడ్డి
–మానవత్వం, దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సర్పంచ్.. క్షతగాత్రుడి వైద్యానికి రూ.25 వేల సాయం సలాం ప్రొద్దుటూరు: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వానికి నిదర్శనమని చాటి చెప్పారు కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వలస కార్మికులను పరాయి రాష్ట్రానికి చెందిన వారని చూడకుండా తన వంతు సహాయం అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.ప్రొద్దుటూరు ఖాదరాబాద్ సమీపంలోని మద్యం గోడౌన్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాకు చెందిన ముగ్గురు హమాలీలు పని ముగించుకుని...