అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
–15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపై కమిషనర్ సమీక్ష –నిర్లక్ష్యం వహించిన ఇన్‌చార్జి ఏఈ ఉదయ్‌కుమార్‌రెడ్డి పై ఆగ్రహం సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై కమిషనర్ సమగ్రంగా సమీక్షించారు. మొత్తం 49 పనులకు...