ప్రజా దర్బార్‌లో అర్జీల స్వీకరణ.. రూ.75.11 లక్షల CMRF చెక్కుల పంపిణీ

–ప్రజా సమస్యలపై తక్షణ స్పందన.. అధికారులకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలు   సలాం   ప్రొద్దుటూరు: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో ప్రొద్దుటూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన 68 మంది లబ్ధిదారులకు రూ.75,11,230 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి...