ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల సంరక్షణపై రైతులకు అవగాహన

  సలాం ప్రొద్దుటూరు –  గోపవరం: ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల ఆరోగ్య పరిరక్షణ, పశుగ్రాసం, నీటి నిర్వహణ, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు అవగాహన కల్పించేందుకు పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో గోపవరం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 32 మంది రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. ఇందిర మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితుల్లో పశువులపై వేడి ఒత్తిడి ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. పశువుల యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస నిర్వహణ, నీటి పొదుపు, వేడి ఒత్తిడి నివారణకు తీసుకోవాల్సిన...