సలాం ప్రొద్దుటూరు:
శివాలయంలో జరిగిన అవినీతి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి కోరారు.
శివాలయంలో జరిగిన అవినీతి వ్యవహారంపై విచారణ నిమిత్తం ప్రొద్దుటూరుకు వచ్చిన లోకాయుక్త డీఎస్పీ కృష్ణను మాదాసు మురళి కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా శివాలయానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై అధికారులు ఏ స్థాయిలో ఉన్నా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు.
విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత రికార్డులు, లావాదేవీలు, నిర్ణయాలను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆరోపణలు రుజువైతే బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని, దోషులకు శిక్ష పడేలా చూడాలని మాదాసు మురళి కోరారు.
లోకాయుక్త అధికారులు ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.