రోడ్డుపై కార్ల రాకపోకల వివాదం.. వ్యక్తిపై దాడి
–తీవ్రంగా గాయపడి కంటి చూపు కోల్పోయిన యువకుడు.. –ఇద్దరిపై కేసు సలాం ప్రొద్దుటూరు: రోడ్డుపై కార్లు పక్కకు తీసే విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తిపై దాడికి దారితీసింది. ఈ ఘటనలో గాయపడిన యువకుడు కంటి చూపు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిపై ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల ప్రకారం.. సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి సుమారు 11.45 గంటల సమయంలో ప్రొద్దుటూరు పట్టణంలోని గౌరమ్మకట్ట వీధిలో గౌరమ్మతల్లి...