ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా 59వ ఇంజనీర్స్ డే వేడుకలు
–విశ్వేశ్వరయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి –విద్యార్థులకు ప్రిన్సిపాల్ పాలెం గురుమూర్తి రెడ్డి సూచన సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 59వ ఇంజనీర్స్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. 1995–98 మెకానికల్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. పూర్వ విద్యార్థులు మిఠాయిలు పంచిపెట్టి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్, పూర్వ విద్యార్థుల సమన్వయకర్త పాలెం గురుమూర్తి రెడ్డి...