ప్రొద్దుటూరులో ఘనంగా గణేష్ మహారాజ్ జైత్రయాత్ర

  –పెద్దశెట్టిపల్లిలో నిమజ్జనానికి పురపాలక సంఘం విస్తృత ఏర్పాట్లు   సలాం  ప్రొద్దుటూరు: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో గణేష్ మహారాజ్ జైత్రయాత్ర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా బుధవారం ప్రారంభమైంది. జైత్రయాత్రలో భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈసారి గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పెద్దశెట్టిపల్లి ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు పురపాలక అధికారులు తెలిపారు. గతంలో పట్టణంలోని వివిధ ప్రాంతాలతో పాటు కుందూ నదిలోనూ విగ్రహాల నిమజ్జనం జరిగేది. అయితే నదీ పరివాహక...