
–46 మంది లబ్ధిదారులకు రూ.35.24 లక్షల చెక్కుల పంపిణీ
సలాం ప్రొద్దుటూరు:
కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గానికి సంబంధించిన 31వ విడత సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ విడతలో 46 మంది లబ్ధిదారులకు రూ.35,24,537 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,401 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,22,95,126 మేర సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎంఆర్‌ఎఫ్ పంపిణీ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో 2, 3 స్థానాల్లో ఉందని తెలిపారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు.
పలువురు టీడీపీ నాయకుల హాజరు
కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, టీడీపీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వర రెడ్డి, మార్కెట్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి, సీతారామిరెడ్డి, నూరి, మాడెం సుధాకర్ రెడ్డి తదితర కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు.
