ఎస్ఆర్‌ఐటీ కళాశాలలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
–ఆధునిక ఇంజనీరింగ్‌లో ఏఐ, డిజిటలైజేషన్ కీలకం: ఎస్.కె. చాంద్ భాషా సలాం ప్రొద్దుటూరు: భారతరత్న, ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్స్ డే వేడుకలను ప్రొద్దుటూరులోని ఎస్ఆర్‌ఐటీ కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ముఖ్య అతిథులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమానికి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ (APSPDCL) ప్రొద్దుటూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.కె. చాంద్ భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొద్దుటూరు డీఈ...