SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 11:40 pm Posted by : SALAM PRODDATUR

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల జాబితా పరిశీలన

ఎంపీడీవో కార్యాలయంలో కూటమి పార్టీల ప్రతినిధుల సమావేశం..

– జాబితా అందజేత

సలాం ప్రొద్దుటూరు:

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల జాబితా పరిశీలన, అభ్యంతరాల స్వీకరణపై ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన జాబితాను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే నిబంధనల ప్రకారం తెలియజేయాలని అధికారులు సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు రామారావు, జనసేన పార్టీ నాయకులు జిలాన్ బాషా, తాలమాపురం మంచి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.