SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 11:49 pm Posted by : SALAM PRODDATUR

గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ ఆక్షన్ వాయిదా

 

 

సలాం   ప్రొద్దుటూరు:

గాంధీ పార్క్‌లోని మున్సిపల్ క్యాంటీన్‌కు సంబంధించి బుధవారం 16.09.2026 ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన ఆక్షన్‌ను పోలీసుల సూచనల మేరకు వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.

 

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాయిదా పడిన ఆక్షన్‌కు తదుపరి తేదీ, సమయం నిర్ణయించిన అనంతరం ప్రొద్దుటూరు పురజనులకు అధికారికంగా తెలియజేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

 

ఆక్షన్ వాయిదా నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ విజ్ఞప్తి చేశారు.