–కోటవీధి, వెదుర్లబజార్‌లో వినాయక మండపాల సందర్శన
— ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆసం రఘురామిరెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి నగరంలోని వివిధ వినాయక మండపాలను సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
స్థానిక కోటవీధిలో శ్రీవినాయక యూత్ అసోసియేషన్ 23వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆసం రఘురామిరెడ్డి కుటుంబ సమేతంగా వినాయక మండపాన్ని సందర్శించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
అనంతరం జనసేన నాయకుడు మాదాసు మురళి ఆహ్వానం మేరకు స్థానిక వెదుర్లబజార్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని గణనాథుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమాల్లో ఆసం రఘురామిరెడ్డి సోదరుడు, ఏఆర్ ట్రావెల్స్ అధినేత ఆసం సురేష్ కుమార్ రెడ్డి, కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
