ఏపీలో పురపాలక ఎన్నికలకు కసరత్తు వేగం
–ఈ నెల 22న వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురణ సలాం ప్రొద్దుటూరు –అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తును వేగవంతం చేసింది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితా తయారీపై అధికారులు దృష్టి సారించారు.రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియను ఎస్ఈసీ పూర్తి చేసింది. ఈ మేరకు రెండు ప్రత్యేక నోటిఫికేషన్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా...