SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 4:53 pm Posted by : SALAM PRODDATUR

వినాయక చవితి వేడుకల్లో ప్రత్యేక పూజలు

 

 

సలాం ప్రొద్దుటూరు:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.

 

వినాయక చవితి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని, విఘ్నేశ్వరుని కృపతో ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు.