బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపు
–స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్ పదవుల వరకు బీసీలకు పెద్దపీట – మార్కెట్ యార్డ్ ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ సలాం ప్రొద్దుటూరు: బీసీలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత ప్రాధాన్యం కల్పించడంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ పేర్కొన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తూ వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం ను టీడీపీ చేస్తుందన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు...