SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 7:37 am Posted by : SALAM PRODDATUR

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపు

 

–స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్ పదవుల వరకు బీసీలకు పెద్దపీట

– మార్కెట్‌ యార్డ్ ఇన్‌చార్జి చైర్మన్‌ పట్నం లక్ష్మణ్‌

సలాం ప్రొద్దుటూరు:

బీసీలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత ప్రాధాన్యం కల్పించడంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రొద్దుటూరు మార్కెట్‌ యార్డ్ ఇన్‌చార్జి చైర్మన్‌ పట్నం లక్ష్మణ్‌ పేర్కొన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తూ వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం ను టీడీపీ చేస్తుందన్నారు.

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించేందుకు గతంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని లక్ష్మణ్‌ గుర్తుచేశారు. ఆయన ప్రారంభించిన బీసీ సాధికారత విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ సాధికారతకు దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీసీ నాయకత్వం ఎదిగేందుకు టీడీపీ అవకాశాలు కల్పిస్తోందన్నారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ బీసీలకు ప్రాధాన్యం

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బీసీ వర్గాలకు చెందిన నాయకులకు నామినేటెడ్ పదవులు, వివిధ కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ నాయకత్వం వారికి ప్రాధాన్యం కల్పించిందని లక్ష్మణ్‌ తెలిపారు.యాదవ సామాజిక వర్గానికి చెందిన చల్లా రాజగోపాల్‌, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నల్లబోతుల నాగరాజు తో పాటు పలువురికి రాష్ట్రస్థాయిలో బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్లలో స్టేట్‌ డైరెక్టర్‌ పదవులు, ఇతర నామినేటెడ్‌ పదవులను ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన బీసీ నాయకులకు కేటాయించినట్లు తెలిపారు.డాక్టర్‌ వి.ఎస్‌. ముక్తియార్‌కు చైర్మన్‌ పదవి కల్పించడం కూడా బీసీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

యువతకు రాజకీయ అవకాశాలు

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో అనేక మంది యువతకు రాజకీయ అవకాశాలు లభించాయని ఆయన తెలిపారు. పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల పరిషత్‌ ప్రతినిధులు, చైర్మన్లుగా ఎదగడానికి పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి లు సహకరించారన్నారు.బీసీలతో పాటు అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు భవిష్యత్తులోనూ తగిన గుర్తింపు, బాధ్యతలు, పదవులు కల్పించేందుకు నాయకత్వం కట్టుబడి ఉందన్నారు.

బీసీల రాజకీయ సాధికారతే లక్ష్యం

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ నిర్ణయాల్లో భాగస్వాములుగా తీర్చిదిద్దడమే టీడీపీ లక్ష్యమని లక్ష్మణ్‌ అన్నారు. ఎన్టీ రామారావు ప్రారంభించిన బీసీ సాధికారతకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరింత బలం చేకూరుతోందన్నారు.బీసీలకు స్థానిక సంస్థల నుంచి రాష్ట్రస్థాయి వరకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకత్వానికి బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.