స్థానిక సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా
–జనసేన నాయకుడు మాదాసు మురళి హామీ సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని శ్రీనివాసపురం ప్రాంతంలో నెలకొన్న రహదారి, డ్రైనేజీ సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి హామీ ఇచ్చారు.శనివారం శ్రీనివాసపురం ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు దరిశ వీరనారాయణ, స్కాలర్స్ బాలసుబ్బారెడ్డి, కందుకూరి భాష తదితరులు మాదాసు మురళిని కలిసి తమ సమస్యలను వివరించారు. 20 ఏళ్లుగా అధ్వానంగా రోడ్డు శ్రీనివాసపురం ప్రధాన...