SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 4:51 pm Posted by : SALAM PRODDATUR

వర్షాలు సమృద్ధిగా కురవాలని శ్రీరామ భజన బృందం యాత్ర

 

 

–భక్తిశ్రద్ధలతో ఊరూరా శ్రీరామ నామస్మరణ

– పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు

 

సలాం ప్రొద్దుటూరు –మైలవరం:

మండలంలోని నక్కవానిపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ భజన బృందం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో యాత్ర చేపట్టారు. భజన బృందం సభ్యులు ఊరూరా తిరుగుతూ శ్రీరామ నామస్మరణ, భజనలు నిర్వహిస్తూ ఉప్పలపాడు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి యాత్రగా బయలుదేరారు.ఈ సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలువురు గ్రామస్థులు యాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ప్రార్థనలు చేశారు.శ్రీరామ నామస్మరణతో సాగిన ఈ యాత్ర భక్తులను ఆకట్టుకుంది.