బాలల హక్కుల పరిరక్షణకు సీడబ్ల్యూసీ, జేజేబీ నియామకాలు వెంటనే పూర్తి చేయాలి

  –అరకొర నియామకాలతో బాలల హక్కులకు భంగం – సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి   సలాం ప్రొద్దుటూరు –కడప: ఆంధ్రప్రదేశ్‌లో బాలల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWC), జువైనల్ జస్టిస్ బోర్డులు (JJB) నియామకాలను అరకొరగా కాకుండా పూర్తిస్థాయిలో తక్షణమే చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు.   రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ కె.జి. వెంకట పద్మలత కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో...