SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 4:37 pm Posted by : SALAM PRODDATUR

కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘన నివాళి

 

 

–ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం

 

సలాం   ప్రొద్దుటూరు:

కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి యూనియన్ గౌరవ అధ్యక్షులు పి. రాఘవ మాట్లాడుతూ.. కార్మికులు, కర్షకులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం సీతారాం ఏచూరి జీవితాంతం అవిశ్రాంతంగా పోరాడారని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి యూనియన్ అధ్యక్షురాలు రత్తమ్మ, ప్రధాన కార్యదర్శి కళావతి, కోశాధికారి మహేష్, కమిటీ సభ్యులు దేవి రాణి, మల్లమ్మ, మరియమ్మ, జ్యోతి, అక్క, రామేశ్వరం, లక్ష్మి, 102 తల్లి-బిడ్డ వాహన డ్రైవర్లు మహేష్, వంశీతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.