కమ్యూనిస్టు ఉద్యమం ప్రజలకు నిత్య అవసరం
–సామాజిక న్యాయం సోషలిజంతోనే సాధ్యం –సీపీఎం సీనియర్ నాయకులు కందారపు మురళి సలాం ప్రొద్దుటూరు –కడప: సీతారాం ఏచూరి కమ్యూనిస్టు విలువలను చాటిచెప్పిన గొప్ప నాయకుడని, ఆయన ఆశయాల సాధనకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీపీఎం సీనియర్ నాయకులు కందారపు మురళి పేర్కొన్నారు. సామాజిక న్యాయం సోషలిస్టు విధానాల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. కడపలోని స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో శనివారం సీపీఎం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ సంస్మరణ సభ నిర్వహించారు. సీపీఎం...