ఏడేళ్ల కన్నీటి కథకు.. ఎమ్మెల్యే వరద చొరవతో తెర!
–ఆధార్ లేని 12 ఏళ్ల బాలికకు అధికారుల సమన్వయంతో ప్రత్యేక సహాయం –పద్మకు ఆధార్ నమోదు.. –సదరం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా తదుపరి చర్యలు –ఎమ్మెల్యే , మున్సిపల్ కమిషనర్ ను కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు, ప్రాంతవాసులు సలాం ప్రొద్దుటూరు: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణమే స్పందిస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరోసారి తన మానవీయతను చాటుకున్నారు. ఏడేళ్లుగా ఆధార్ కార్డు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైన 12...