52 వార్డుల వారీగా సమగ్ర ఓటర్ల వివరాలు ఇవ్వాలి

  –మున్సిపల్ కమిషనర్‌కు జనసేన పార్టీ స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీ వినతి   సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా చేపట్టిన వార్డుల విభజన, ఎస్‌ఐఆర్‌ విభజన అనంతరం ఏర్పడిన 52 వార్డుల వారీగా, బూత్‌ల వారీగా సమగ్ర ఓటర్ల నివేదికను అందించాలని జనసేన పార్టీ స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ కోరింది.ఈ మేరకు జనసేన పార్టీ ప్రొద్దుటూరు స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ తరఫున ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌ శ్రీ టి. విశ్వనాథ్‌ గారికి అర్జీ సమర్పించారు....