SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 1:42 am Posted by : SALAM PRODDATUR

52 వార్డుల వారీగా సమగ్ర ఓటర్ల వివరాలు ఇవ్వాలి

 

–మున్సిపల్ కమిషనర్‌కు జనసేన పార్టీ స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీ వినతి

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా చేపట్టిన వార్డుల విభజన, ఎస్‌ఐఆర్‌ విభజన అనంతరం ఏర్పడిన 52 వార్డుల వారీగా, బూత్‌ల వారీగా సమగ్ర ఓటర్ల నివేదికను అందించాలని జనసేన పార్టీ స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ కోరింది.ఈ మేరకు జనసేన పార్టీ ప్రొద్దుటూరు స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ తరఫున ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌ శ్రీ టి. విశ్వనాథ్‌ గారికి అర్జీ సమర్పించారు. నూతన వార్డుల పరిధిలోని ప్రతి బూత్‌కు సంబంధించిన ఓటర్ల సంఖ్యతో పాటు బూత్‌ల వారీగా పురుషులు, మహిళల ఓటర్ల వివరాలు, అలాగే అందుబాటులో ఉన్న మేరకు కులాల వారీగా విభజించిన ఓటర్ల నివేదికను అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

వెంటనే స్పందించిన కమిషనర్‌

జనసేన పార్టీ ప్రతినిధులు సమర్పించిన అర్జీపై మున్సిపల్ కమిషనర్‌ శ్రీ టి. విశ్వనాథ్‌ వెంటనే స్పందించి సంబంధిత అధికారికి తగిన సూచనలు చేసినట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు. అవసరమైన ఓటర్ల వివరాలను అందించేందుకు చర్యలు చేపట్టిన కమిషనర్‌కు జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

ఎన్నికల నిర్వహణకు సమాచారం కీలకం

 

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వార్డులు, బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలు అందుబాటులో ఉండటం ఎన్నికల నిర్వహణ, సమన్వయం, ప్రణాళికకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జనసేన పార్టీ స్థానిక సమన్వయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. అధికారులు కోరిన సమాచారాన్ని పారదర్శకంగా అందించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రొద్దుటూరు కోఆర్డినేషన్ టీం సభ్యులు రామారావు, తలమాపురం మంచి శివకుమార్‌, మాదాసు మురళి, బాబ్జి, సుంకర మురళి, రామోజీ ప్రసాద్‌ పాల్గొన్నారు.