స్మార్ట్ కిచెన్‌ను పరిశీలించిన ప్రకృతి వ్యవసాయ డీపీఎం, విదేశీ బృందం

    –ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్న విధానంపై ఆరా   సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్‌లో నిర్వహిస్తున్న స్మార్ట్ కిచెన్‌ను కడప జిల్లా ప్రకృతి వ్యవసాయ డీపీఎం ఎస్.వి. ప్రవీణ్ కుమార్‌తో పాటు విదేశీ ప్రతినిధుల బృందం శుక్రవారం పరిశీలించింది. ఐక్యరాజ్యసమితి అంతర్గత పర్యవేక్షణ సేవల కార్యాలయం (OIOS) నుంచి వచ్చిన కరోలిన్ కురియా, జోసెఫిన్ స్మార్ట్ కిచెన్‌లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.ప్రొద్దుటూరు మండల పరిధిలో మొత్తం 69 పాఠశాలలు ఉండగా, వాటిలో 53...