“స్థానిక ఎన్నికల్లో ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యమే లక్ష్యం!”
— ఇమాములతో డా. ముక్తియార్ కీలక భేటీ సలాం ప్రొద్దుటూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం సమాజానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ కీలకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ పరిధిలోని వివిధ మసీదుల ఇమాములతో శుక్రవారం స్థానిక ఈద్గా మస్జిద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షుడు డా. వి.ఎస్. ముక్తియార్...