స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం
–ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వార్డుల వారీగా పార్టీ బలాబలాలపై సమీక్ష సలాం ప్రొద్దుటూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో కడప పార్లమెంటు పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం వార్డుల సంఖ్య, వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, స్థానికంగా జనసేన పార్టీకి ఉన్న బలం, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు తదితర అంశాలను...