మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ల సమావేశం

    –ఓటర్ల జాబితా, ప్రజా సమస్యలు, పరిపాలనా అంశాలపై చర్చ   సలాం  మైదుకూరు: మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల సమావేశం నిర్వహించారు. ERO మధుసూదన్ రావు, తహసిల్దార్ రాజా నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలతో పాటు ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియ మరియు పరిపాలనా విషయాలపై చర్చించారు.   ఈ సందర్భంగా అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై...