SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:12 pm Posted by : SALAM PRODDATUR

మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ల సమావేశం

 

 

–ఓటర్ల జాబితా, ప్రజా సమస్యలు, పరిపాలనా అంశాలపై చర్చ

 

సలాం  మైదుకూరు:

మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల సమావేశం నిర్వహించారు. ERO మధుసూదన్ రావు, తహసిల్దార్ రాజా నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలతో పాటు ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియ మరియు పరిపాలనా విషయాలపై చర్చించారు.

 

ఈ సందర్భంగా అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులు సూచించారు.

 

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ ఆసిఫ్ హుస్సేన్ పాల్గొని పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.