మార్కెట్ యార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రత్యేక దృష్టి
–దెబ్బతిన్న భవనాలకు పునరుద్ధరణ.. –ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం సలాం ప్రొద్దుటూరు: రైతులు, వ్యాపారులకు కీలకమైన ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు అభివృద్ధిపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్కెట్ కమిటీ పరిధిలోని భవనాలు అక్కడక్కడా దెబ్బతిన్నాయని ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు.మార్కెట్ యార్డును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, దెబ్బతిన్న భవనాలు, ఇతర సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డు మౌలిక వసతులను మెరుగుపరిచి,...