SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 8:33 pm Posted by : SALAM PRODDATUR

ప్రజల ముంగిటకు టీడీపీ.. 5వ వార్డులో “ఇంటింటికి టీడీపీ”

 

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన

 

సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు:

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు మున్సిపాలిటీ 5వ వార్డులో శుక్రవారం “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాయిని పెద్దన్న, వీరభద్రుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ, 101వ బూత్ ఇన్‌చార్జి కమాల్ బాషా, ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్ హుస్సేన్, తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, జనసేన నాయకులు కరీముల్లా, రాజశేఖర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.