పోషణ పక్వాడలో భాగంగా అవగాహన కార్యక్రమం

  సలాం ప్రొద్దుటూరు –మైలవరం: మైలవరం మండలం దొడియం , బూబుసానిపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల మెదడు, శారీరక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని, శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్రారంభమవుతుందని తల్లులకు, బాలింతలకు అవగాహన కల్పించారు. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై సూచనలు అందించారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడం, చిన్నారులు మరియు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన పోషకాహారం అందించడమే పోషణ పక్వాడ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం....