పురసేవ కేంద్రంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

  –సిబ్బంది పనితీరుపై ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక   సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘంలోని పురసేవ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేంద్రానికి చేరుకున్న ఆయన సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న పౌర సేవలు, దరఖాస్తుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ, పెండింగ్ దరఖాస్తులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం, దరఖాస్తుల పరిష్కారంలో...