చెకుముకి సైన్స్ సంబరాల్లో విద్యార్థుల ప్రతిభ
–మండల స్థాయి పోటీల్లో విజేతలు జిల్లా స్థాయికి ఎంపిక సలాం ప్రొద్దుటూరు –జమ్మలమడుగు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన “చెకుముకి సైన్స్ సంబరాలు” మండల స్థాయి పోటీలు విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడంతో నిర్వహించారు. మూడు మండలాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు.మండల స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం, మూఢనమ్మకాలకు...