గణేష్ ఉత్సవాలపై పోలీసుల నిఘా.. పేకాట ముఠాపై కొరడా!
–శాంతి కమిటీ సమావేశం.. నిర్వాహకులకు పలు సూచనలు –పెద్దశెట్టిపల్లెలో అక్రమ పేకాట గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్ సలాం ప్రొద్దుటూరు: గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు ఉత్సవ కమిటీల ప్రతినిధులు, గ్రామ పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి నిబంధనలపై అవగాహన కల్పిస్తుండగా.. మరోవైపు అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు,...