రవీంద్రభారతిలో నటరాజ కళాక్షేత్రం గురువులు, విద్యార్థులకు జాతీయ స్థాయి గౌరవం
–‘విశ్వ నాట్య రత్న’, ‘భారతీయ నాట్య రత్న’ అవార్డులతో ఘన సత్కారం సలాం ప్రొద్దుటూరు–హైదరాబాద్: ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ నటరాజ కళాక్షేత్రం గురువులు, విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏఎస్‌కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గురువులకు వందనం’ కార్యక్రమంలో వారికి ఘన సత్కారం లభించింది.ఈ సందర్భంగా నటరాజ కళాక్షేత్రం నాట్యగురువులు పఠాన్ మొహిద్దీన్ ఖాన్, పఠాన్ సొహైల్ ఖాన్, పి. మిత్రవిందలకు నృత్యరంగానికి అందించిన...