నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి
–రేషన్ కార్డుదారులకు 14 రకాల సరుకులు అందించాలి –ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ డిమాండ్ సలాం ప్రొద్దుటూరు –కడప: నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి పేదలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. కడపలో నిర్వహించిన ధర్నాలో...